నేటి సాక్షి, రాయికల్ : మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది అని బిజెపి జగిత్యాల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సురతాని భాగ్యలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.ఈ సందర్భంగా ఏఎన్ఎం లు విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి, జుబేదా ఫాతిమా, సరిత, ఆశా వర్కర్లు విజయలక్ష్మి, వసంత లను, మెప్మా ఆర్పి లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, బాలికలు పాల్గొన్నారు.



