నేటిసాక్షి, కమాలాపూర్:
కమలాపూర్ మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ వద్ద సోమవారం రోజున యువజన కాంగ్రెస్ కమలాపూర్ మండల శాఖ వైస్ ప్రెసిడెంట్ చేరాల రోహిత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది.పోటీలలో మొదటి బహుమతిగా మౌటం లావణ్య(5016), రెండవ బహుమతిగా పిట్టల శ్రీవిద్య (3016), మూడో బహుమతిగా దూలం ప్రవస్తి(2016) గెలుచుకోవడం జరిగినది. నాలుగో బహుమతి మండ అనూష, ఐదో బహుమతి కనుకుంట్ల వందన, ఆరవ బహుమతి బైరి కావేరి, ఏడవ శ్వేత, ఎనిమిదవ శృతి, తొమ్మిదవ సహస్ర, పదవ అరుణ బహుమతులు చీరలుగా తీసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి విజేతలకు బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలసాని రమేష్, తౌటం రవీందర్, మౌటం కుమారస్వామి, నరసింహారెడ్డి, నాంపల్లి ప్రభాకర్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు ధర్మల శ్రీకాంత్, అసెంబ్లీ కార్యదర్శి ఆడేపు శ్రీకాంత్, కమలాపూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దూడ శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ ఏంబడి తేజ,ప్రధాన కార్యదర్శి గలీబ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.





