- మీసం పుష్పలతను తొలగించొద్దు అంటూ మహిళలు నిరసన
- ప్రజాపాలన గ్రామసభలో వ్యతిరేకంగా మాట్లాడిందని ఆరోపణలు
- వివోఏ పుష్పలతను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐకెపి ఎపిఎం లావణ్య
నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): వివో ఏగా పుష్పలతను తొలగించడం అన్యాయమంటూ, కుట్రపూరితంగా ఆమెపై చర్యలు తీసుకున్నారని ఆరోపిస్తూ మహిళా సంఘాల సభ్యులు గన్నేరువరం మండల కేంద్రంలో మహిళా సమైక్య భవనం ముందు సోమవారం నిరసన తెలియజేసి, ధర్నా చేపట్టారు. గన్నేరువరానికి చెందిన మీసం పుష్పలత హరిప్రియ గ్రామ సమైక్య అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తుంది. అయితే పుష్పలత ఈనెల 22వ తేదీన గన్నేరువరంలో జరిగిన ప్రజా పాలన గ్రామసభలో తన వ్యక్తిగత ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా తన పేరు రాలేదని ఆవేదనతో అధికారులతో మాట్లాడిందని తెలిపింది. దీనిని దృష్టిలో పెట్టుకుని కొందరు కాంగ్రెస్ నాయకులు ఆమెపై కుట్ర పొంది ఆమెను ఎలాగైనా తీసేయాలని పెద్ద సారు దృష్టికి తీసుకువెళ్లారని కక్ష పూర్వంగా ఆమెను తొలగిస్తున్నారని మహిళా సంఘం సభ్యులు మహిళలు తీవ్రంగా మండిపడ్డారు. మీసం పుష్పలతను తొలగించొద్దు అంటూ 2015 సంవత్సరం నుంచి హరిప్రియ సంఘానికి ఆమె అభివృద్ధి చేసిందని కొంతమంది రాజకీయ స్వార్థం కోసం ఆమెను తొలగిస్తున్నట్లు తెలుస్తుందని ఇది సరైన పద్ధతి కాదని మహిళలు మండిపడ్డారు. ఆమెను మళ్లీ విధుల్లోకి చేర్చకుంటే ధర్నాలు చేస్తామని తెలిపారు. ఆమెను తీసేస్తే హరిప్రియ సంఘం నుండి తమ అందరం వెళ్ళిపోతమని మహిళలు హెచ్చరించారు. ఐకెపి ఎపిఎం లావణ్య మీడియా వివరణ కోరగా ఆమె మాట్లాడుతూ 22వ తేదీన గన్నేరువరం గ్రామసభలో హరిప్రియ వివోఏ పుష్పలత ఉద్యోగగా కాకుండా అల్లరి చేసినందుకు పైనుంచి తీసేయాలని ఆదేశాలు వచ్చినట్లు గ్రామ సంఘం మూడుసార్లు సమావేశం ఏర్పాటు చేయగా ఫోరం లేకపోయేసరికి నోటీసులు జారీ చేసి మళ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు పుష్పలతను అందరి సమక్షంలో వివోఏ గా విధులు నుండి తొలగించినట్లు తెలిపారు.





