Monday, March 30, 2026

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

  • మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ) : వేములవాడ పట్టణంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని “మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్” సభ్యుల ఆధ్వర్యంలో పలు రంగాల్లో విశేష కృషి చేసిన పలువురు మహిళలు (ఇంజనీర్) రాగంపేట పవన, (వైద్యులు) డాక్టర్ నాగమల్ల పద్మలత, (న్యాయవాదులు) బూర సరిత, కూనబోయిన పావని, (మీడియా) స్రవంతి, (ఉపన్యాసాకులు) కొమురవెళ్లి మానస,(పోలీస్)హోమ్ గార్డ్ సుజాత, (పారిశుద్ధ్యం) కార్మికురాలు లక్ష్మీ లను శాలువాతో ఘనంగా సన్మానించి,మెమోంటో లు అందజేయడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ మధు మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్,నగుబోతు రవీందర్, వొడ్యాల వేణు, తాళ్లపల్లి ప్రశాంత్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, తోట రాజు, పాత సంతోష్, పొలాస రాజేందర్, గొండ ప్రసాద్, నక్క వేణు, చల్లా సత్తయ్య, పసుల శ్రీనివాస్, సగ్గు రాహుల్, మధు కవిత, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News