Thursday, March 26, 2026

మహిళలు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి

  • జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
  • నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : మహిళలు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యసారద తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇతర బాద్యులకు, మహిళా అధికారులకు పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆదివారం సెలవు ఉంటుంది, కానీ మహిళలకు సెలవు అనేది ఉండదని తెలిపారు. నిరంతరం కుటుంబ సభ్యుల క్షేమం శాఖ పరమైన అభివృద్ధి లో భాగంగా ఒక మహిళ నిరంతరం, అహర్నిశలు కృషి చేస్తూ ఉంటుందని జిల్లా కలెక్టర్ అన్నారు. స్ట్రెస్ అనేది మహిళల కే కాదు పురుషుల్లో కూడా ఉంటుందని, పురుషులకు కూడా హెల్త్ క్యాంప్ అవసరమని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గుర్తు చేశారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని మన కోసం మనం ఆలోచించినప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతామని ఈ సందర్భంగా మహిళలకు సూచించారు. అనంతరము అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ గతంలో కంటే ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఉద్యోగి పరిస్థితుల ప్రభావం వలన ఎన్నో టెన్షన్స్ కి గురవుతారని తెలిపారు. వాటిని అధిగమించాలంటే మోటివేషనల్ క్లాస్ తప్పనిసరి అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నమనేని జగన్ మోహన్ రావు మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు వృత్తి పరమైన బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతల వలన తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారని, ప్రతి మహిళ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ప్రతి 6 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించు కోవాలని తెలిపారు. టీజీవో అసోసియేషన్ మహిళా అధికారుల సంక్షేమానికి ప్రత్యేకంగా మహిళ విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా మెడికోవర్ హాస్పిటల్స్ వరంగల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంప్ లో జిల్లా కలెక్టర్ వారి హెల్త్ చెక్ చేసుకోవడమైనది. ఈ క్యాంపులో డాక్టర్ మౌనిక రాజ్ గైనకాలజిస్ట్ మరియు కార్డియాలజిస్ట్ డాక్టర్ షఫీ ఉద్యోగులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ పై అవగాహన కల్పించారు. ఈ హెల్త్ క్యాంపులో బీపీ, షుగర్, ఈ సి జి, పాప్ స్మియర్ టెస్టులు నిర్వహించారు. హెల్త్ క్యాంపుకు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించు కోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, ఆర్డీవో నర్సంపేట ఉమారాణి, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ కౌసల్య, డిపిఓ కల్పన, ఇతర జిల్లా అధికారులు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు రాం రెడ్డి, కార్యదర్శి ఫణి కుమార్, సహా అధ్యక్షులు అనురాధ, నీరజ, హనుమకొండ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్, రాజేష్ కుమార్, ట్రెస్సా జిల్లా అధ్యక్షులు తాసిల్దార్ రాజ్ కుమార్, నాన్ గెజిటెడ్ సంఘం అధ్యక్షులు రామ్ కిషన్, వేణుగోపాల్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News