- జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన క్రీడల పోటీల ను హనుమకొండ కలెక్టరేట్ లోని లాండ్లో మరియు టీజీవో భవన్ లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంబించారు. నిరంతరం కుటుంబ సభ్యుల క్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటుందని, స్ట్రెస్ రిలీఫ్ కావడానికి పాటల పోటీలు నిర్వహించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఈ కార్య క్రమంలో టీ జీ వో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నమనేని జగన్ మోహన్ రావు జిల్లా అధికారులు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు రాంరెడ్డి, కార్యదర్శి ఫణి కుమార్, సహా అధ్యక్షుడు అనురాధ, నీరజ, హనుమకొండ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్, రాజేష్ కుమార్, మాధవి, శ్రీలక్ష్మి, ప్రియ, చేతన, హేమలత, కిరణ్మయి, తన్మయి, అరుణ, పవిత్ర, జయంతి లు హాజరయ్యారు.




