నేటి సాక్షి చెన్నూర్ టౌన్: మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా చెన్నూర్ వ్యవసాయ అధికారి కార్యాలయంలో మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానం జరిపారు. కార్యక్రమలో చెన్నూర్ వ్యవసాయ అధికారి యామిని మాట్లాడుతూ.. మహిళా అన్ని రంగాల్లో ముందుకు వెళుతూ సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తూ రానున్న రోజుల్లో అన్ని రంగాలలో మహిళా ఒక శక్తిగా ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణ మహిళ అధికారులు కుంభం వణదేవి, శివరంజని, మాళవిక ఉద్యోగులను చెన్నూర్ వ్యవసాయ విస్తరణ అధికారులు రాజశేఖర్, సాగార్, సాయి రైతులు మహిళా ఉద్యోగులను సన్మానించారు.



