నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ మండలంలోని హుజురాబాద్ క్లబ్ ఆవరణంలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో క్లబ్ క్లబ్ ఓనర్ రవీందర్ రావు, ఏఎస్ఐ కమల, ఉమెన్ హ్యూమన్ రైట్స్ పునుగు లత, మాజీ చైర్మన్ గందె రాధిక, గవర్నమెంట్ టీచర్ అనురాధ, మాజీ కౌన్సిలర్ రమాదేవి, మాజి కౌన్సిలర్ లావణ్య, ఆయుర్వేద వైద్యురాలు జ్యోతిరాణి, సామాజిక వైద్య సేవకురాలు రేణుక, డాక్టర్ అర్చన, హెల్త్ డిపార్ట్మెంట్ సుజాత, హుజురాబాద్ సెంటర్ మేనేజర్ ఖాజాబీ, రజిత, కళ్యాణి, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చిన మహిళల మహిళలందరికీ సంతోషంగా ఆటలు పాటలు ఉమెన్స్ డే ప్రత్యేకత నిర్వహించుకొని గెస్ట్ ల యొక్క అమూల్యమైన సందేశాలను పంచుకోవడం జరిగింది. వచ్చిన గెస్ట్ లందరికీ శాలువాలతో సన్మానం చేయడం జరిగింది. అలాగే బాలవికాస ద్వారా మహిళా వికాస సంఘం ఏర్పడడానికి సహకారం చేసిన విలేజ్ లీడర్స్ కి మరియు వితంతువుగా జీవితాన్ని సక్సెస్ చేసుకున్న మహిళలకు మహిళలకు సన్మానం చేయడం జరిగింది. సందర్భంగా మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందరూ భోజనం చేసి చిన్న గిఫ్ట్ తీసుకొని సంతోషంగా వెళ్లడం జరిగింది.





