నేటి సాక్షి, కోదాడ (అనంతగిరి) : దాతల సహకారంతో సీతారాముల వారి ముఖద్వారా పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మాజీ సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు అన్నారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో సీతారామాంజనేయ స్వామి రామాలయానికి ముఖద్వారము ఏర్పాటు చేయుటకు అమీనాబాద్ గ్రామస్తులు దాతలుగా సహకరించిన వారిని కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ… శ్రీరామనవమి కల్లా ఈ ముఖద్వారము పూర్తయ్యే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ రహదారిని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. మరో మారు ముఖద్వారానికి సహకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామినేని అప్పారావు, సాదే సైదయ్య తదితరులు పాల్గొన్నారు.



