Friday, March 13, 2026

పనులను త్వరగా ప్రారంభించాలి

  • ఏపీఏ జి.యం.

నేటి సాక్షి,రామగిరి(కన్నూరి రాజు): అడ్రియాల ప్రాజెక్ట్ గనిలో కాంట్రాక్టు పనులను త్వరగా ప్రారంభించాలని వెన్సర్ కంపెనీ ప్రతినిధులకు అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొప్పుల వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం జీఎం కార్యాలయం నందు వెన్సర్ కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ అడ్రియాల లాంగ్ వాల్ గనిలోని వివిధ పనులకు వెన్సర్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టు ప్రకారం ఏప్రిల్ లోపు పనులను చేపట్టాలని, అందుకు తగిన ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ కొలిపాక నాగేశ్వరరావు, ఏరియా ఇంజనీర్ కె. యాదయ్య, వెన్సర్ కంపెనీ ప్రతినిధులు కరుణాకర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News