- హుజురాబాద్ నుండి మెజారిటీ దిశగా పనిచేయాలి.
- నిరుద్యోగులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.
- ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనకు కాంగ్రెస్ కృషి చేస్తే,వాటిని బీజేపీ నిర్వీర్యం చేస్తుంది.
- నియోజకవర్గంలోని అన్ని పట్టణ,మండల కేంద్రాల్లో విస్తృత స్థాయి సమావేశాలు.
- ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యహాలపై కార్యకర్తలకు దిశా-నిర్దేశం.





నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు):
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై హుజురాబాద్ పరిధిలోని అన్ని మండలాల్లో, పట్టణాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై కార్యకర్తలకు దిశా-నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన సంవత్సర కాలంలో ప్రభుత్వం నిరుద్యోగులకు 55 వేల పైచిలుకు ఉద్యోగాలు అందజేసిందని,42 నియోజకవర్గాల కంటే ఈ నియోజకవర్గం నుండి మెజారిటీ ఇచ్చి హుజురాబాద్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పట్టభద్రుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని దీన్ని ఓటర్లలోకి విసృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. ఇతర అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి చాలా తేడా ఉందని విద్యాసంస్థల పేరునే తన ఇంటిపేరుగా మార్చుకొని, పట్టభద్రుల సమస్యలపై శాసనమండలిలో గట్టిగా కొట్లడతారని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పట్టభద్రులు ఇబ్బందులకు గురి చేసిందనీ, సమయానికి జీతాలు ఇవ్వక వారి జీవితాలతో అడుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖే జీతాలు అందజేస్తున్నామని తెలిపారు. బీజేపి పార్టీ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని, దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రభుత్వ రంగంతో పాటు, ప్రయివేటు రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలకు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని దీనికి సూచికగా ఇటీవలి దావోస్ పర్యటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు భారీగా పెట్టుబడులు తీసుకురావడమే నిదర్శనమని అన్నారు. రాబోయే మూడు, నాలుగు నెలల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తామని తెలిపారు.





