నేటి సాక్షి గోదావరిఖని (రమేష్)
జీడికే టు ఇంక్లైన్ కార్మికుని మృతి పై సంతాపం వ్యక్తం చేసిన INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్. ఆర్జీవన్ పరిధిలోని జీడికే 2 ఇంక్లైన్ కి చెందిన గొల్లపల్లి నరేష్ కుమార్ అనే 32 సంవత్సరాల కార్మికుడు శుక్రవారం ఉదయం మాస్టర్ పడిన కొద్దిసేపటికి గుండెపోటు తొ చనిపోగా విషయం తెలిసిన వెంటనే గోదావరిఖని ఏరియా ఆసుపత్రి లో మృత దేహాన్ని సందర్శించి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ప్రతి గని వద్ద అంబులెన్స్ సౌకర్యం కల్పించేలా యాజమాన్యం తో మాట్లాడతామని అలాగే బాధిత కుటుంబాన్ని పరామర్శించి యూనియన్ నుంచి పూర్తిస్థాయిగా సహకారాలు ఉంటాయని ధైర్యాన్ని కల్పించారు . ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి జనరల్ సెక్రెటరీ వికాస్ కుమార్ యాదవ్ , ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ సదానందం , బ్రాంచ్ సెక్రటరీ శ్రీనివాస్ , ఏరియా హాస్పిటల్ నాయకులు గంగాధర్ సుశీల , సిరిపురం నర్సయ్య , హరీష్ తదితరులు పాల్గొన్నారు.