Wednesday, March 18, 2026

“పర్యావరణ సుస్థిరత” 2025 పై నిట్ లో వర్క్‌షాప్

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : వరంగల్ పర్యావరణ సృస్థిరత 2025 పై వరంగల్ నెట్లో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సభ్య కార్యదర్శి జి. రవి ఐఏఎస్ విశిష్ట అతిథిగా వరంగల్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ సత్య శారద, ఐఏఎస్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్య క్రమానికి నిట్ వరంగల్ డైరెక్టర్ మరియు వర్క్‌షాప్ ముఖ్య పోషకుడు ప్రొఫెసర్ బిద్యధర్ సుబుధి హాజరయ్యారు. ఈ కార్యక్రమం అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్, వరంగల్ లో నిర్వహించడమైనది. తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు స్పాన్సర్‌ గా వరంగల్‌ లో మిషన్ లైఫ్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన పర్యావరణ సుస్థిరత పై ఒకరోజు వర్క్‌ షాప్ జాతీయ గీతాలాపన తో కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిధి విశిష్ట అతిథి తో వర్క్‌షాప్ కన్వీనర్లు ప్రొఫెసర్ ఆనంద్ కిషోర్ కోలా మరియు ప్రొఫెసర్ పి. వెంకటేశ్వర రావు, ప్రముఖులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ ఎస్ 2025 కన్వీనర్ ప్రొఫెసర్ ఆనంద్ కిషోర్ కోలా, వర్క్‌షాప్ నేపథ్యం మరియు లక్ష్యాలను వివరిస్తూ ప్రారంభ వ్యాఖ్యలు చేశారు. వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యధర్ సుబుధి హాజరైన వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, పర్యావరణాన్ని పరిరక్షించడం లో ప్రతి పౌరుడి బాధ్యతలను నొక్కి చెప్పారు. పర్యావరణాన్ని మరింతగా పెంపొందించడానికి వరంగల్‌ లో చేపట్టిన వివిధ కార్యక్రమాల వర్క్ షాప్ నిర్వహించడమైనది. విశిష్ట అతిథిగా హాజరైన వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మాట్లాడుతూ.. స్థిరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హైలైట్ చేశారు. పర్యావరణ స్పృహతో కూడిన జీవనశైలిని స్వీకరించాలని పేర్కొన్నారు. వరంగల్ పూర్వ విద్యార్థి జి. రవి, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు యొక్క కార్యాచరణ ప్రణాళిక మరియు వ్యూహాలను వివరిస్తూ, హరిత కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. స్థిరమైన భవిష్యత్తును నిర్ధారించడం లో సమిష్టి బాధ్యత యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ప్రశంసలకు చిహ్నంగా, అతిథులను మరియు డైరెక్టర్‌ను వరంగల్ తరపున మరియు ఈ ఎస్ 2025 నిర్వాహక కమిటీ తరపున సత్కరించారు. జాతీయ గీతాలాపన తో కార్యక్రమం ముగిసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News