నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) :
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల పరిధిలోని జయగిరి గ్రామంలో శనివారం బాలవికాస సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా బాల వికాస హసన్ పర్తి మండల మహిళ కో..ఆర్డినేటర్ అలువాల శోభ హాజరై మాట్లాడుతూ సకల చరాచర జీవకోటికి ప్రాణదారం అయినా నీరు అలాంటి నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఈ భూ ప్రపంచంలో ప్రతి ప్రాణి జీవించడానికి నీరు అవసరం, ప్రతి మనిషికి ప్రతి రోజు ఐదు లీటర్ల నీళ్లు తాగడానికి పరిశుభ్రమైన నీరు అవసరం. 50 లీటర్లు ఇంటి అవసరాలకు, ఇతర అవసరాలకు 200 లీటర్లు ప్రస్తుతం కావాలి కానీ ఇక్కడ పరిశుభ్రమైన నీరు లభించక ప్రతి సంవత్సరము 14 లక్షల మంది మరణించడం జరుగుతున్నది 2050 సంవత్సరాల వరకు 55% మందికి పరిశుభ్రమైన నీరు లభించని పరిస్థితి రానున్న రోజుల్లో ఏర్పడుతుందని ఐక్యరాజ్య సమితి నివేదికలు తెలియ జేస్తున్నాయి నిత్య జీవితంలో ఇంతటి ప్రధానమైన నీటిని రాబోయే తరాలకు అందించాలంటే మనం ప్రతి నీటి బొట్టును పొదుపుగా వాడుకోవలసిన అవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే భూమిపై 70% నీరు ఉన్నప్పటికీ దానిలో 20% మాత్రమే మంచినీటి చెరువులు బావులు, నదులు ఉన్నాయి వాటి ద్వారా మనకు త్రాగడానికి నీరు లభిస్తున్నది ఇప్పుడున్న పరిస్థితులలో పెరుగుతున్న జనాభా ప్రకారం అవసరాలకు నీరు సరిపోవడం లేదు అంతేకాకుండా మారుతున్న జీవనశైలి పెరుగుతున్న కాలుష్యం ఉష్ణోగ్రతలు వాతావరణం లో మార్పులు పెరిగి భూమి లోపల నీటిని పీల్చి వేస్తున్నాయి తద్వారా భూగర్భ జలాలు అంతరించి పోతున్నాయి ఈ వాతావరణ కాలుష్యం వలన రాను రాను వర్షాలు కురియక నీటి ఎద్దడి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రకృతి సిద్ధమైన నీటిని వృధా చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవులు త్రాగడానికి నీరు లేక నీటిని ఫిల్టర్ చేయబడిన క్యాన్లను బాటిల్లను నీటిపై ఎక్కువగా ఆధార పడడం చూస్తూనే ఉన్నాం నీటిని చుక్క, చుక్కాగా పొదుపు చేసి భావి తరాలకు అందించ వలసిన బాధ్యత ఉందని నీటిని ఈ రకంగా పొదుపు చేయవచ్చు 1) నల్లాల నుండి నీరును కారి పోకుండా జాగ్రత్తలు, 2) ఇంట్లో అవసరాలకు నీటిని పొదుపుగా వాడుకోవాలి, 3) మనం కాళ్లు చేతులు కడిగిన నీళ్లను బట్టలు ఉతికిన నీళ్లను పెరటి లోని చెట్లకు మళ్లించాలి, 4) వాన నీటిని సంరక్షించుటకు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి, 5) మనము పండ్లు తోముకున్నప్పుడు స్నానం చేసినప్పుడు షవర్ లను వాడకుండా బకెట్లను ఉపయోగించాలి, 6) వాన నీటిని చెరువుల లోనికి కాలువల లోనికి మళ్ళించాలి, 7) మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పరిశుభ్రమైన నీరు మనకు లభిస్తుంది, ఎక్కడపడితే అక్కడ మొక్కలను నాటి పెంచాలి, ఈ రకంగా మనం నీటిని సంరక్షించుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా నీటిని పొదుపుగా చేసుకోవచ్చు అని విద్యార్థులకు గ్రామస్తులకు తెలియజేశారు అనంతరం విద్యార్థులతో ఉపాధ్యాయులచే తాగునీరు, సాగునీరు, జీవనానికి మారుపేరు, జల సంరక్షణ, ప్రకృతి రక్షణ, నీటిని కాపాడుకుందాం, నీటి సంరక్షణకై అవగాహన కల్పించుటకు ప్రజలను చైతన్యం చేయుట కోసం గ్రామంలో ర్యాలీగా తిరగడం ప్రతిజ్ఞ చేయించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ జి శ్రీధర్, ఉపాధ్యాయులు పి శ్రీహరి, ఏ అనిత, బి శ్రీధర్, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, బాలవికాస కో..ఆర్డినేటర్స్ అలువాల శోభ, పుల్ల పద్మ, గ్రూప్ లీడర్స్ రేణు కుంట్ల దీపిక, గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.