Friday, March 20, 2026

నిన్న తల్లి నేడు కొడుకు, కూతురు మృతి

  • భర్త వేధింపుల వల్లే భార్య హారిక పిల్లలతో సహా ఆత్మహత్య

నేటిసాక్షి (కె గంగాధర్ ), పెగడపల్లి : పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన కంబాల హారిక గురువారం రోజున తన భర్త అయినా తిరుపతి వేధింపుల కారణంగా క్షణికావేశంలో తాను పురుగుల మందు తాగి తన పిల్లలు అయినా క్రిష్ణాంత్ (10) సంవత్సరాలు మరియు మయాంతి ఎనిమిది(8) సంవత్సరాలు ఇద్దరు పిల్లలు కూడా అదే పురుగుల మందు త్రాగి స్పహ కోల్పోయారు అది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాదులోని యశోద హాస్పిటల్ కి తరలించగా కంబాల హారిక శుక్రవారం నాడు చికిత్స పొందుతూ యశోద హాస్పిటల్ లో మరణించింది. ఇదిలావుండగా శనివారం తెల్లవారుజామున పిల్లలు అయినా కృష్ణంత్ కరీంనగర్ లోని ప్రతిమ ఆసుపత్రిలో మరియు మయాంతి కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఈ సంఘటనపై పెగడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ రవి కిరణ్ తెలిపారు తెలిపినారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News