Sunday, March 29, 2026

యోగా టీచర్ అన్నపూర్ణకు జాతీయస్థాయి ప్రేరణ పురస్కారం

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్.)
యోగ సీనియర్ శిక్షకు అనేక అవార్డులు సన్మానాలు పొందిన టీచరుగా సదా శయ ఫౌండేషన్ నగర అధ్యక్షురాలిగా విహెచ్పి జిల్లా సహా సంయోజతగా మగువ లైన్స్ క్లబ్ మెంబర్గా సామాజిక సేవలు అంది స్తున్న అన్నపూర్ణ మేడం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్లోని వినిశెట్టి జగదీశ్వరయ్య స్మారక సేవా సమితి ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జాతీయ స్థాయి ప్రేరణ పురస్కార గ్రహీతగా సేవలందిస్తున్న అన్నపూర్ణ
పట్టణంలో.వెంకటలక్ష్మి వెంకటాద్రిల కుమార్తెగా జన్మించిన అన్నపూర్ణ చిన్నప్పటినుండి చదువులో సాంస్కృతిక కార్యక్రమాల్లో సాహిత్యంలో ఇతర కరికులాల్లో శ్రద్ధ వహిస్తూ ముందుకు సాగుతూ వరంగల్లో ఫార్మసీ పూర్తి చేసిన అనంతరం వివాహ బంధంతో గోదావరిఖనిలో స్థిరపడిన ఈ టీచర్ డిగ్రీ గోదావరిఖల్లో పూర్తి చేసింది యోగాలో టిటిసి పూర్తి చేసి ఉత్తరాఖండ్ రాందేవ్ బాబా వద్ద బెంగళూరు వివేకానంద సెంటర్లో యోగాపై ట్రైనింగ్ పూర్తి చేసింది మొదటి యోగా గురువు భిక్షమయ్య గురువు దగ్గర యోగా అధ్యయనం ప్రారంభించింది ప్రస్తుతం 20 సంవత్సరాల నుండి రామగుండం సింగరేణి రీజియన్ లో అలాగే ఎన్టీపీసీ ఏరియాలో ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వివిధ చోట్ల యోగా క్లాస్ నిర్వహిస్తూ వేలాదిమంది యోగ విద్యార్థులను తయారు చేసిన ఘనత కలిగి ఉంది యోగ శిక్షణ తీసుకున్న వారిలో దాదాపు ఇప్పటివరకు 400 మంది యోగ మాస్టర్లుగా సర్టిఫికెట్ను అందించారు అందులో ప్రస్తుతం 20 మంది యోగ టీచర్లుగా పలు పాఠశాలలో యోగ తరగతి నిర్వహిస్తూ జీవనోపాధిని కూడా పొందుతున్నారుసింగరేణి సంస్థ ద్వారా శారద నగర్ ఏరియాలో ఎన్టిపిసి పరిసరాల్లోని గురుకుల ఇతర పాఠశాలలో యోగా తరగతులను నిర్వహిస్తున్నారు ఇప్పటివరకు ఆరు చోట్ల యోగ టీచర్గా అవార్డులు రివార్డులు పొంది ప్రస్తుతం అలుపెరుగని యోగా టీచర్ గా చేస్తున్న సేవలను గుర్తించిన వరంగల్ వినిశెట్టి జగదీశ్వరయ్య స్మారక సేవా సంస్థ గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జాతీయస్థాయి ప్రేరణ పురస్కార గ్రహీతగా అవార్డును అందుకోవడం జరిగింది అలాగే ఉత్తర ప్రదేశ్ శాంతి ఫౌండేషన్ ద్వారా ఇంటర్నేషనల్ ఆఫ్ ఉమెన్ అవార్డు కూడా పొందారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News