Wednesday, March 11, 2026

ప్రమాదవశత్తు యువకుడి మృతి

నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టి ఎన్ రమేష్ :
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం, తిమ్మారెడ్డి గ్రామ శివారులోని, రామలింగం బావి దగ్గర, మూలమలుపు వద్ద, నిజాంసాగర్ మండలం, గర్గుల్ గ్రామానికి చెందిన, వీరాని కాశయ్య అనే 40 సంవత్సరాల వ్యక్తి ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, కాశయ్య ఎల్లారెడ్డి లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంబంధికులను, పరామర్శించేందుకు శనివారం రాత్రి తన బైక్ పై ఎల్లారెడ్డి వస్తుండగా, మార్గమధ్యంలో తిమ్మారెడ్డి గ్రామ శివారులోని, రామలింగం బావి వద్ద బైకు అదుపుతప్పి, కింద పడి తలకు భయ బలమైన గాయాలు కావడంతో, కాశయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News