
సైదాపూర్, నేటి సాక్షి : సైదాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన చోటుచేసుకుంది. సైదాపూర్ మండల పరిధిలోని రామచంద్రపురం (అగ్రహారం) గ్రామంలో అర్థరాత్రి బైక్ అదుపతప్పి రోడ్ ప్రక్కన మూలమలుపు ప్రమాధకర సూచిక స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పొన్నం మహేందర్ (26) తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరుకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికి చెందినవారని పోలీసులు గుర్తించారు.

