Friday, March 20, 2026

యువకులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

  • చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ అజీమ్
  • వాలీబాల్ జూనియర్ క్రీడ కారులకు వాలీబాల్ క్రీడా కిట్ పంపిణీ

నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): చదువుతోపాటు యువకులు క్రీడల్లో రాణించాలని చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ అజీమ్ అన్నారు .గురువారం చందుర్తి జనతా గ్యారేజ్ వర్క్ షాప్ వద్ద జూనియర్ వాలీబాల్ క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మాట్లాడుతూ… యువకులు చెడు అలవాటులకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాల వైపు దృష్టి పెట్టాలని సూచించారు..క్రీడలపై ఆసక్తి పెంచుకొని క్రీడల్లో రాణించాలని తెలిపారు. గ్రామీణ క్రీడలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, పాఠశాల కళాశాలల్లో పీఈటీలను నియమించి క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోజూనియర్స్ క్రీడాకారులు నిఖిల్, ప్రమేష్ రాఘవ, ప్రవీణ్, శివ, సన్నీ, అభిషేక్, సాయి చరణ్, మనోజ్, ఇర్ఫాన్, మహేష్, జహీర్, గణేష్ , భావేష్, యుగంధర్, శ్రీశాంత్, శ్రీ వర్ధన్, వివేక్, తదితరులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News