- మన్మోహన్ సింగ్ మరణంపై సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంతాపం
- మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్
నేటి సాక్షి, సైదాపూర్:
సైదాపూర్ కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ నివాళి అర్పించి మాట్లాడుతూ…. దేశం దిగ్గజ నాయకుడిని కోల్పోయింది అని అన్నారు. దేశానికి రెండుసార్లు ప్రధానిగా సేవలు అందించిన గొప్ప ఆర్థికవేత్త అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను గురువారం సాయంత్రం ఢిల్లీలో ఆయన తుది శ్వాస విడిచారని, ఇక లేరు అన్న విషయం తనను కలచివేసిందన్నారు. వారు దేశానికి దారి చూపిన ఆర్థిక దిక్సూచి అని కొనియాడారు. 1991-96 కాలంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలను 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా అందించిన సేవలను గుర్తు చేశారు. ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మగాని రాజు, మేకల రవీందర్, కూతురు విద్వాన్ రెడ్డి, ఎలూరి ఆదిరెడ్డి, మండల కొమురయ్య, ఎర్రల శ్రీనివాస్, పెద్ది తిరుపతి, అనగోని శ్రీనివాస్, మేకల రాజు, గుంటి స్వామి, గడ్డం శేఖర్, భాస్కర్ నాయక్, గుర్రం వాసుదేవ్, వేముల సురేష్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రమశాఖ అధ్యక్షులు వేల్ది రాజు, బానోత్ కిషన్ నాయక్, కొరిమి రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు బోనగిరి అనిల్, బోడిగే చంద్రమౌళి, తిప్పరపు కిరణ్ పాల్గొన్నారు.

