నేటి సాక్షి, మందమర్రి:- పట్టణంలోని దీపక్ నగర్ కు చెందిన నిరుపేద కుటుంబానికి యూత్ ఫర్ సొసైటీ అండగా నిలిచి, వారికి నిత్యవసరకులు అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యుడు రాయబారపు కిరణ్ మాట్లాడుతూ, పట్టణంలోని దీపక్ నగర్ కు చెందిన వడ్లూరి శంకర్, విజయలక్ష్మి ల దంపతులకు కుమార్తె, కుమారుడు లు కలరు. కూతురు మరుగుజ్జుతనంతో వికలాంగురాలు కావడం, భర్త శంకర్ కి ఇటీవల ఆపరేషన్ జరగడం, పక్షవాతం రావడంతో నడవలేని పరిస్థితి ఏర్పడిందని, శంకర్ తల్లి వృద్ధురాలై మంచానికి పరిమితం కాగా, ఇంటి భారమంతా విజయలక్ష్మి మీదే పడటంతో వారి కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికంతో ఇబ్బంది పడుతున్న వారికి సొసైటీ ఆధ్వర్యంలో నెలకు సరిపడా నిత్యవస సరుకులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎవరైనా వీరికి సహాయం చేయదలచుకుంటే సొసైటీని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు సురేందర్, ఓజ్జ గణేష్, చోటు, మహేష్, అన్వేష్, చింటూ, కిరణ్, బన్నీ, శరత్ కుమార్, షారుఖ్ లు పాల్గొన్నారు.



