Friday, March 20, 2026

తుమ్మలూరు రోడ్డు సమస్య పరిష్కారం కోరుతూ నిరసనకు యువత సిద్ధం

  • నిరసన వివరాలు:తేదీ: శనివారంసమయం: ఉదయం 8.30 గంటలకు
  • స్థలం: పోతలింగన్న (బొడ్రాయి) నుండి ప్రారంభం

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు రోడ్డు పనులు ప్రారంభించి రెండు సంవత్సరాలు అయినా పూర్తికాకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ప్రతిరోజూ మహేశ్వరం వైపు వెళ్లే వారు రోడ్డు దుస్థితి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై అధికారుల నుండి గానీ, కాంట్రాక్టర్ నుండి గానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో తుమ్మలూరు యువత ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.గ్రామ యువత,ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని తుమ్మలూరు రోడ్డు సమస్య పరిష్కారం కోసం తమ నిరసన తెలియజేయాలని యువత విజ్ఞప్తి చేస్తోంది. సత్వర చర్యలు తీసుకోకపోతే, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గ్రామ యువత స్పష్టం చేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News