Thursday, March 19, 2026

యువత లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి

  • హసన్ పర్తి, ఎంపీడీవో కర్ణాకర్ రెడ్డి

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : యువత లక్ష్యం వైపు దృష్టి పెట్టాలని హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల ఎంపీడీవో కర్ణాకర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోనీ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మంగళవారం నెహ్రూ యువకేంద్రం బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన విజేతల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎంపీడీవో కర్ణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా సన్మార్గం వైపుగా పయనించాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాల కనుగుణంగా సమాజంలో గౌరవంగా జీవించాలని యువతను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ సునీత, ప్రధానోపాధ్యాయురాలు సుమాదేవి, విజయలక్ష్మి, వ్యాయామ ఉపాధ్యాయులు శీలం పార్థసారధి, వాసు దేవరావు, పూర్వపు వాలంటీర్ మండ రాజేష్, నెహ్రూ యువ కేంద్ర ప్రోగ్రాం అధికారి బానోతు దేవీలాల్, ఆఫీసు సిబ్బంది సిహెచ్. రాజేశ్వరరావు తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువతీ యువకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News