Friday, March 13, 2026

యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలి

  • మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెలుకల తిరుపతి
  • ముగిసిన రుద్రంగి ప్రీమియర్ లీగ్

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో (ఆర్ పి యల్)రుద్రంగి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టౌర్నమెంట్ ను నిర్వహించారు. గత 3 రోజులుగా కొనసాగుతున్న క్రికెట్ టౌర్నమెంట్ సోమవారం సాయంత్రం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను స్థానిక ప్రజాప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ.. తాము క్రికెట్ టౌర్నమెంట్ నిర్వహించడానికి సహకరించి బహుమతులను స్పాన్సర్ చేసిన బీసీసెల్ అధ్యక్షుడు గండి నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెలుకల తిరుపతి క్రీడాకారులకు బహుమతులను అందజేసి మాట్లాడుతూ, క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని స్పోటివ్ గా తీసుకోవాలని కోరారు. యువత చేడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలపట్ల ఆసక్తి చూపాలని అన్నారు. యువత ప్రతి క్రీడలో నైపుణ్యం పెంచుకొని రాష్ట్ర జిల్లా స్థాయి క్రీడల్లో రాణించి మండలానికి మంచి గుర్తింపు తీసుకురావలని కోరారు. క్రీడాకారులకు అన్ని రకాలుగా సహకరిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి గట్ల మీనయ్య,కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్, గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, నాయకులు ఎర్రం గంగనర్సయ్య, అక్కినపెళ్లి శ్రీనివాస్,కట్కూరి దాసు, పిటి సుంచు అనిల్, సింగరపు గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News