Friday, March 20, 2026

క్రీడల్లో యువత సత్తా చాటాలి

  • జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్

నేటిసాక్షి, రాయికల్: క్రీడల్లో యువత సత్తా చాటాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. రాయికల్ భీమేశ్వర ఆలయ జాతర ఉత్సవాలను పురస్కరించుకొని సంఘమిత్ర యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడల అభివృద్దికి క్రీడాకారుల సంక్షేమానికి తనవంతు సహకారం అందిస్తానని హామి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్దికి పెద్దపీట వేసిందన్నారు. కబడ్డీ పోటీలో విజేతగా నిలిచిన జట్టుకు బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు, సింగిల్విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, నాయకులు గండ్ర ఆచ్యుత్రావు, తురగ శ్రీధర్రెడ్డి, మోర రామ్మూర్తి, మహేష్గౌడ్, చంద్రతేజ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్దికి కృషి భీమేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే పూజలు రాయికల్ పట్టణంలోని పురాతనమైన శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ ప్రత్యేక పూజలు చేసారు. ఆలయ అభివృద్దికి తనవంతు కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఆలయ నిర్వహకులు ఎమ్మెల్యేను శాలువతో సత్కరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News