నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా గుజ్జుల స్వామి : ముక్కనుమ సంక్రాంతి పండుగ సందర్భంగా వనపర్తి పట్టణం ఆరో వార్డు ఫరీద్ రైస్ మిల్ సమీపంలో బీసీ సంఘం నాయకులు గౌనికాడి యాదయ్య ఆధ్వర్యంలో పతంగుల పోటీలను నిర్వహించారు. సుమారు 40 మంది పోటీల్లో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు.గాలిపటాల ను పైకి ఎగరవేయటం, డీల్ వేసి పడగొట్టడంలో పోటీపడ్డారన్నారు. పతంగులు ఎగురవేసి యువకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రథమ బహుమతి గణేష్, ద్వితీయ బహుమతి బబ్బి, తృతీయ బహుమతి నవీన్ చారి గెలుచుకున్నట్లు చెప్పారు. పోటీల్లో విజేతలను గౌనికాడి యాదయ్య అభినందించారు.





