Monday, March 16, 2026

YS జగన్మోహన్ రెడ్డి గారిని కలసిన కళ్యాణ్ భరత్..

నెటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 7తాడేపల్లి YSRCP కేంద్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు,YSR పార్టీ అధ్యక్షులు గౌ శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించినYSRCP విద్యార్థి విభాగ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించటం జరిగింది, మాజీ మంత్రి వర్యులు ,పుంగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ డా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారి ఆదేశాల మేరకు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు గౌ శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నగారి సూచనలతోఈ సమావేశానికి రాష్ట్ర విద్యార్థి విభాగ సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్ హాజరు అయ్యారు,ఈ సందర్భంగా కళ్యాణ్ భరత్ మాట్లాడుతూ నేటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీల ప్రవేటీ కరణను ఏవిధంగా అడ్డుకోవాలి అని ,పేద,బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల సమస్యల పైన ఏవిధమైన పోరాటాలు చేయాలి అని ప్రతి విద్యార్థికి ఏవిధంగా అండగా నిలవాలి అని దిశా నిర్ధేశం చేశారు అన్నారు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు విద్యార్థుల కోసం చేసినటువంటి అమ్మ వడి,విద్యాదీవెన,విద్యా కనుక,ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయటం,గోరు ముద్ద,నాడు-నేడు,మెడికల్ కాలేజీ ల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాల చేశామని మళ్లీ మనం అధికారంలోకి వచ్చాక అంతకు మించిన కార్యక్రమాలు చేపడుతాం అని తెలిపారు అని అన్నారు,అనంతరం శాలువతో సన్మానించి బోయకొండ అమ్మవారి చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలు అందచేశారు,తాము విద్యార్థుల తరపున చేసిన సంక్షేమ హాస్టళ్ల బాట మరియు ఛలో మెడికల్ కాలేజీ ఇతర కార్యక్రమాల గురించి వివరించారు జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణ్ భరత్ ని అభినందిస్తూ మరింత ఉత్సాహంగా,చురుకుగా కష్టపడి పనిచేయాలి అని పార్టీలో కష్టపడింన వారికి సముచిత స్థానం ఉంటుంది అని అన్నారని తెలియ జేశారు , ఈ కార్యక్రమంలోYS RCP చిత్తూరు జిల్లా సోషల్ మీడియా కార్యదర్శి నాగేంద్ర, విద్యార్థి నాయకుడు మల్లికార్జున,చరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News