- ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
- పేదలజీవితాలలోవెలుగులు నింపేందుకు ప్రజాక్షేత్రం లో పురుడుపోసుకున్న పార్టీ
- దేశచరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానానికి ప్రత్యేకత
- పార్టీకి కష్ట నష్టాలలో తోడుగా, అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి
నేటి సాక్షి రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : ప్రజల గుండెల్లో పుట్టి, విశ్వసనీయత, విలువలు, సిద్ధాంతాలుతో ప్రజాక్షేత్రంలో పురుడుపోసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్ట్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానేత వైఎస్ఆర్ అకాల మరణం తరువాత ఆయన లక్ష్యాలు, ఆశయాలును ముందుకు తీసుకెళ్లేందుకు,ప్రజల కోసం వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారన్నారు. జగన్ పోరాటపటిమే పధ్నాలుగేళ్ల రాజకీయ ప్రస్థానానికి నిదర్శనమన్నారు. దేశ చరిత్రలోనే పార్టీ ప్రస్థానానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి ఎన్ టి ఆర్, ఎంజిఆర్ , మమతా బెనర్జీ ల తరహాలో అధికారం చేపట్టి ఆదర్శంగా, పారదర్శకంగా పాలన సాగించారన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా గత జగన్ ప్రభుత్వం పాలన సాగించిందన్నారు. గతఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపు 99 శాతానికి పైగా హామీలను నెరవేర్చిన ఘనత జగన్ కు దక్కుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ జగన్ పాలనలో పేదలకు అందినన్ని సంక్షేమ పథకాలు ఎవ్వరూ అందించలేదన్నారు. సచివాలయ, వాలంటరీ వ్యవస్థలు ఏర్పాటు చేసి ప్రజల ముంగిటకే పాలన అందించారన్నారు. కార్యకర్తలకు వెన్నంటి తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్ట నష్టాలలో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తల కష్టాలలోపాలు పంచుకుంటామన్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళుతామని, వారు చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 12 న రాయచోటి పట్టణం ఎస్ ఎన్ కాలనీ లోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ నెల 12 న బుధవారం ఉదయం 8.30 గంటలకు రాయచోటి పట్టణం ఎస్ ఎన్ కాలనీ యందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ను ఆవిష్కరించడం జరుగుతుందన్నారు.



