Friday, April 3, 2026

ఒకే దేశం – ఒకే ఎన్నిక తో దేశ ప్రగతికి ఎంతో మేలు

  • బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పల్లపు అన్నపూర్ణ
  • బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి ( కోక్కుల వంశీ ) : ఒకే దేశం ఒకే ఎన్నిక ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఇది దేశ భవిష్యత్తును మార్చి నిర్ణయమని మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పల్లప్ అన్నపూర్ణ, ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ అన్నారు. శనివారం రుద్రంగి మండలకేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పల్లప్ అన్నపూర్ణ, ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానాన్ని అమలు చేసేందుకు ఈ బిల్లు ను రూపొందించిందని దీనివల్ల దేశ ప్రగతికి చాలా ప్రయోజనం ఉందని, ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ప్రతి బిజెపి కార్యకర్తలు విస్తృతంగా ప్రచార నిర్వహించాలని కోరారు. పార్లమెంట్ మరియు రాష్ట్రాల ఎన్నికలు వివిధ దశలలో ఎన్నికలు జరగడం వల్ల చాలా ఇబ్బందులు సమస్యలు ఎదురవుతున్నాయని, ఆర్థికంగా కూడా దేశం కుంటుపడుతుందని, ఒకే దేశం ఒకే ఎన్నిక ద్వారా దేశ ఖజానా చాలా మిగులుతుందని, దేశ ప్రజలు నిజాయితీగా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అవకాశం చాలా బాగుపడుతుందని దీనిపై పోలింగ్ బూతుల వారిగా ప్రచారం చేయాలని కోరారు. నేడు బిజెపి లోకి మహిళలు చేరారని తెలిపారు. వారిలో తల్లపల్లి లలిత, తీగల లక్ష్మి, నెవురి నవీన, భూక్యా రంజిత, బాణోత్ లలిత బిజెపి పార్టీలో లో చేరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు అల్లూరి అశోక్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు బోయినీ రాజు, తాళ్లపల్లి బాలకిషన్ రావు,కర్నవత్తుల వేణు, నెవూరి కిషన్, పెద్ది శ్రావణ్, అల్లూరి రవీందర్ రెడ్డి, పండుగు గంగాధర్, మంచే వసంత్, గసికంటి వెంకటి, అక్కేనపల్లి నర్సింగరావు, పడాల గజనంద్, భూక్యా నరేష్, భూక్యా ప్రశాంత్, నేవురి శేఖర్, నీవురి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News