నేటి సాక్షి, ఎండపల్లి: తండ్రిని హత్య చేసిన ఘటనలో కుమారుడికి జీవిత ఖైదీతో పాటు జరిమాన విధించడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని గోడిశేలపేట గ్రామానికి చెందిన రెబ్బసు పోచయ్య కు ఇద్దరు కుమారులు కాగా తన స్థలాన్ని, ఇల్లుని ఇద్దరి కొడుకులకు సమానంగా పంచి ఇచ్చినాడు. తన భార్యతో కలిసి తన పెద్ద కొడుకు లచ్చయ్య ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో పోచయ్య కు తన పెద్ద కొడుకైన లచ్చయ్యకు తరచూ ఇంట్లో నుండి వెళ్లిపోమ్మని గొడవలు జరిగేది. దీనిపై తేది 01-04-2022 రోజున తండ్రి కొడుకుల మధ్య వాగ్వివాదం జరగగా పెద్దకొడుకు లచ్చయ్య కర్రతో తండ్రి పోచయ్య తల, శరీరం పై విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. తీవ్ర రక్తస్రావంతో ఉన్న పోచయ్యను కరీంనగర్ లోని హాస్పిటల్ కు తరలించగా మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎమ్జీఎమ్ హాస్పిటల్ లో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. మృతుడి భార్య మల్లవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడైన రెబ్బసు లచ్చయ్య ను కోర్టులో హాజరు పరచడం జరిగింది. కేసు ను విచారించిన జిల్లా సెషన్స్ జడ్జీ నీలిమ నిందితునికి జీవిత ఖైదుతో పాటు 6000 /- రూపాయల జరిమాన విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసులో సాక్షాధారాలు అందించి నిందుతుడికి శిక్ష పడటంలో కృషి చేసిన పోలీసులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.





