నేటి సాక్షి నారాయణపేట అక్టోబర్ 27, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలం ఎంపీడీవో గా మహమ్మద్ అఫ్జల్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇన్చార్జిగా ఎంపిటిఓ గా కొనసాగుతున్న వెంకటేశ్వర్ రెడ్డి కొనసాగారు. పట్టి స్థానంలో ధన్వాడ మండల ఎంపీడీవో గా మహమ్మద్ అబ్దుల్ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ధన్వాడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శిల ఆధ్వర్యంలో శాలువలు పూలమాలలతో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలం సూపర్డెంట్ వెంకటేశ్వర రెడ్డి, మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.





