నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం) తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనాలు ఉన్నందున పూరి గృహాలలో నివసిస్తున్న వారు ముందుగానే పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్ రావు చెప్పారు. సోమవారం గణపవరం పంచాయతీ పరిధిలోని బాపూజీ కాలనీలో పర్యటించి స్థానికులను తుఫాను ప్రభావం పై అప్రమత్తం చేశారు. అదేవిధంగా కర్లపాలెం మండలంలో ఉన్న 20 గ్రామాలలో ప్రతి గ్రామాలలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అప్రమత్తం చేశామన్నారు అత్య ఔషధం పరిస్థితిలో తప్ప బయటికి ఎవరు రావద్దని ప్రజలకి సూచించారు. కర్లపాలెం మండల అభివృద్ధి అధికారి అద్దూరి శ్రీనివాసరావు, సెక్రెటరీ, సిబ్బంది తదితరులు ఉన్నారు.





