Friday, April 3, 2026

బోయకొండ గంగమ్మ అమ్మవారిని ఇద్దరు ఎమ్మెల్యేలు దర్శించిన ఎమ్మెల్యేలు : టిడిపి నాయకులు

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి ఏప్రిల్ 3 అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం లో ప్రసిద్ధ బోయకొండ గంగమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాజకీయ నేతల రద్దీ నెలకొంది. ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్‌తో పాటు టిడిపి నాయకుడు మబ్బు దేవనారాయణ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేలు మరియు నాయకులకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటానని ముందుగా సంకల్పించిన టిడిపి యువ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మాటను గుర్తుచేసుకుంటూ, ఆ మొక్కును నెరవేర్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గానికి చెందిన ముఖ్య తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి సేవలో నిమగ్నమయ్యారు. ఆలయ ప్రాంగణం నినాదాలతో మార్మోగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News