పేట ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్
నేటి సాక్షి,నారాయణపేట, ఏప్రిల్ 6,
శ్రీరామనవమి సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఉదయం పల్లా హనుమాన్ దేవాలయం దగ్గర హిందూ మత పెద్దలు, యువకులతో కలిసి శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ… శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శమని సమాజంలో మంచిని స్వీకరిద్దాం మంచిని పంచుదాం శ్రీ రామచంద్రుడి దివ్య ఆశీస్సులతో అంత సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా తమ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, నాయకులు, బజరంగ్దళ్ యువకులు మొదలగువారు పాల్గొన్నారు.





