నేటి సాక్షి ఏప్రిల్ 03పెద్దకడబూరు మండలానికి నూతనంగా నియమితులైన ఎస్ఐ ఈ. మారుతిని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. విధుల్లో సమర్థవంతంగా పనిచేసి ప్రజల విశ్వాసాన్ని పొందాలని ఆకాంక్షించారు.మండలంలో శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, ప్రజాప్రతినిధులు–పోలీసుల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఐను కోరారు.ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను వినడం, న్యాయం చేయడం ద్వారా మంచి పేరును సంపాదించాలని సూచించారు. అందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.





