Friday, April 3, 2026

క్షతగాత్రులను మాజీ డిప్యూటీ సీఎం పరామర్శ

  • ఘటనపై నారాయణస్వామి దిగ్బ్రాంతి

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) వెదురుకుప్పం:-
శ్రీరంగరాజపురం మండలం లోని పొదలపల్లి క్రాస్ దగ్గర శుక్రవారం జరిగిన ట్రాక్టర్ బోల్తా పడిన రోడ్డు ప్రమాద ఘటన పై మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెదురు కుప్పం మండలం యనమలమంద గ్రామానికి చెందిన 30 మందికి గాయాలయ్యాయి.విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి ఫోన్ ద్వారా క్షతగాత్రులను పరామర్శించారు.వేలూరు సిఎంసి ఉన్న మహిళ ఆరోగ్య పరిస్థితిని స్థానిక వైద్యులను అడిగి తెలుసుకున్నారు.తీవ్రంగా గాయపడిన మహిళలకు మేరుగైన చికిత్స అందించాలని సూచించారు.అదే విధంగా చిత్తూరు అపోల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ఓదార్చారు.అక్కడ ఎజిఎం నరేష్ రెడ్డి తో మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడి మరింత మెరుగైన వైద్య సేవలు నిర్వహించాలని కోరారు.తిరుపతి స్విమ్స్ ఎమర్జెన్సీ లో చికిత్స పొందుతున్న ముగ్గురు క్షతగాత్రులను ఫోన్ ద్వారా పరామర్శించారు. వైద్యం అందించాలని స్వీమ్స్ డైరెక్టర్ ను కోరారు. డియం అండ్ హెచ్ ఓ సుధారాణి తో మాట్లాడి క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News