నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రామచంద్రాపురం రాష్ట్ర బిజెపి అధిష్టానం ఆదేశాల మేరకు బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ నాయుడు మండల కమిటీ సభ్యులు జాబితాను ప్రకటించారు. అందులో భాగంగా ఉపాధ్యక్షులు గా చండీశ్వర్ రెడ్డి, గిరిజా రాణి, హరిప్రసాద్, శివశంకర్ రెడ్డి, కుమార్, భాగ్యలక్ష్మి, జనరల్ సెక్రటరీలుగా ప్రసాద్, గోపి నాథ్, సెక్రటరీ లు శివా, నాగరాజు, రాజశేఖర్, రమాదేవి, మౌనిక, కృష్ణమూర్తి, కోశాధికారి రామకృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ లుగా రోసిరెడ్డి, ముని ప్రసాద్, డిల్లీ రెడ్డి, చిరంజీవి, తేజ లను మండల కమిటీ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం రాయలు చెరువు కట్ట దిగువ ఉన్న రాయలు మండపంలో అధ్యక్షులు ఆధ్వర్యంలో కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మండలంలోని నడవలూరు గ్రామానికి చెందిన కృష్ణ మూర్తి, ఎన్ ఆర్ కమ్మపల్లి చెందిన రాజేశ్వరి, కట్టకింద వెంకటాపురం కు చెందిన తేజాలకు జనార్థన్ నాయుడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈసందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రధాన మంత్రి మోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు బిజెపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు అడుగు జాడలు లో నడిచేందుకు నడుమ బిగించాలని పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ నాయుడు, మునెయ్య, గోపి నాగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, రోసి రెడ్డి, రామకృష్ణారెడ్డి , పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





