- డాక్టర్ తేజస్విని
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రామచంద్రాపురం మండలం కుప్పం బాదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బొప్పరాజు పల్లి గ్రామంలో 104 ఆరోగ్య సేవల కార్యక్రమంలో భాగంగా కుప్పం బాదురు ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ తేజస్విని ఆధ్వర్యంలో వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవికాలం లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగు తున్నందువలన వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వృద్ధులు పెద్దలు పిల్లలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగ కుండా ఇంటి పట్టునే ఉండాలని అన్నారు. ఏమైనా పనులుంటే ఉదయం 10 నుండి 11 గంల లోపే చూసుకోవాలని బయటికి వెళ్ళాల్సి వస్తే గొడుగు, టోపి, తలపాగా వంటివి తలకు రక్షణ గా ధరించాలని తెలిపారు. మంచి నీళ్ళు, ఉప్పు కలిపిన మజ్జిగ, ఓ ఆర్ ఎస్ పానీయం వంటివి అధికంగా తీసుకోవాలని తెలిపారు. మాంసాహారం తగ్గించి శాఖాహారం అధికం గా తీసుకోవాలన్నారు. పుచ్చకాయలు, దోస కాయలు వంటి శరీరానికి చలువ చేసే పండ్లు తో బాటు పండ్ల రసాలు తీసుకుంటే మంచిదన్నారు. పలుచటి కాటన్ దుస్తులు ధరించాలని తెలిపారు. నీరసం, కళ్ళు తిరగడం, తల నొప్పి, వాంతులు వంటి వడ దెబ్బ లక్షణాలు ఉంటే వారిని చల్లటి ప్రదేశం లో ఉంచి ప్రథమ చికిత్స చేసిన తరువాత వారిని వీలైనంత తొందరగా దగ్గర లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని తెలిపారు. ప్రతినిత్యం సచివాలయాల్లోనూ గ్రామాల్లోనూ ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కమార్ , సుబ్బలక్ష్మి , ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు సిబ్బంది పాల్గొన్నారు.





