Friday, April 3, 2026

రంగారెడ్డి రూరల్ జిల్లా నూతన అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీరాములు అందెల

  • రంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఒక తిరుగులేని శక్తిగా అవతరించనుంది – శ్రీరాములు అందెల

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్) : ఇటీవల రంగారెడ్డి జిల్లా రూరల్ బిజెపి అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన శ్రీ పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ ని ఈరోజు శంషాబాద్ లోని వారి నివాసంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ నూతన జిల్లా అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ సారిద్యంలో రంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఒక తిరుగులేని శక్తిగా అవతరించబోతుందని, అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక ప్రజా ప్రతినిధులను భారతీయ జనతా పార్టీ సాధించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, కో కన్వీనర్ సంతోష్, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తర్రే మల్లేష్ యాదవ్, తుక్కుగూడ మున్సిపాలిటీ మాజీ చైర్మన్, మున్సిపాలిటీ అధ్యక్షులు బరిగెల హేమలత రాజు గౌడ్, బడంగ్ పేట్ కార్పొరేషన్ అధ్యక్షులు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి, రామిడి వీరకర్ణ రెడ్డి, బిజెపి జిల్లా సీనియర్ నాయకులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి, ఢిల్లీ వెంకటేష్ ముదిరాజ్, తుక్కుగూడ మున్సిపాలిటీ బీజేవైఎం అధ్యక్షులు బరిగెల రాకేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News