Saturday, April 4, 2026

అఖిలపక్ష నేతలతో కేఎల్ఆర్ భేటీ

  • ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం మండలం విలీనంపై విజ్ఞప్తి.
  • ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చిన కిచ్చెన్న

నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలని అఖిలపక్ష నాయకులు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కలిశారు. తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ… మహేశ్వరాన్ని మహానగరంగా మార్చాలంటే ఫోర్త్ సిటీలో కలపాలన్న విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్ ఉండాలంటే ఫ్యూచర్ సిటీలో విలీనం చేయాలని మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ కోరిందని చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న రెండు మండలాలను ఫోర్త్ సిటీలో కలిపితేనే బాగుంటుందని ముఖ్యమంత్రి, మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు గ దృష్టికి తీసుకెళ్తామని లక్ష్మారెడ్డి చెప్పారు. జేఏసీ అధ్యక్షులు రఘుపతి సహా బీజేపీ నేతలు జంగయ్య యాదవ్, సుదర్శన్ రెడ్డి, మాదవాచారి, సుదర్శన్ యాదవ్, బీఆర్ఎస్ వర్కళ్ల యాదగిరి, హనుమగళ్ల చంద్రయ్య, కర్ణటి మనోహర్, సీపీఐ దత్తు నాయక్, సీపీఎం రవి సహా మండల నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News