ప్రాథమికంగా అంచనాకు వచ్చిన అధికారులు
నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : ఈదురు గాలులు, అకాల వర్షాలతో బుగ్గారం మండలంలో 200 ఎకరాల్లో మొక్క జొన్న పంటకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా నిర్ధారించామని వ్యవసాయ విస్తరణ అధికారి నవీద్ తెలిపారు. శనివారం ఆయన వెల్గొండ గ్రామంలో దెబ్బతిన్న పంటను పరిశీలించి మాట్లాడారు. ధాన్యం పూర్తిగా పరిపక్వతకు రాని పంట నేలకు ఒరిగినట్టు గుర్తించామని ఆయన చెప్పారు. బుగ్గారం, వెల్గొండ గ్రామాల్లో ఎక్కువ మొత్తం నష్టం జరిగిందని అన్నారు. బుగ్గారం,వెల్గొండలో పంట దెబ్బతిన్న రైతులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేముల సుభాష్ పరామర్శించారు. వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లి, దెబ్బతిన్న పంటను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారం తో ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసానిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మండల ఉపాధ్యక్షులు నగునూరి నర్సగౌడ్, మండల యూత్ అధ్యక్షులు సిగిరి అంజిత్, తాడేపు లింగన్న,దసర్తి పోసన్న,నక్క శంకర్, దూడ తిరుపతి, కేతిరెడ్డి, వెల్గొండ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కస్తూరి మల్లేష్, రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.





