నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : న్యాయవాదులు మరియు గుమస్తాలా సంక్షేమ చట్టం పై శుక్రవారం శాసన సభ ఆమోదం తెలపడం పై శనివారం సీనియర్ న్యాయవాది కట్కo వేణుగోపాల్ హర్షం వెలిబుచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం పరంగా నేటి న్యాయవాదులు మరియు వారి గుమస్తాలు అనేక రకాల ఇబ్బందులు ఎదురుకుంటున్నారని అన్నారు. వారిపట్ల ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి చట్టం చేయడం అభినందనీయం అన్నారు. న్యాయవాదులపై రోజు రోజుకి పెరుగుతున్న దాడుల్ని దృష్టిలో పెట్టుకుని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పై కూడా ప్రభుత్వం త్వరతగతిన బిల్లు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి సంవత్సరానికి వేల సంఖ్యలో బయటికి వస్తున్న న్యాయ విద్యార్థులకు ఉపాధి కల్పించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం పై ఉందని ఆయన గుర్తు చేసారు.





