Saturday, April 4, 2026

అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం పక్షాన ఆదుకుంటాం

నెటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): చందుర్తి మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం రోజున కురిసినటు వంటి అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం పక్షాన ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి అన్నారు. ఈ సందర్భంగా పంట పొలాలను మండల నాయకులతో కలిసి పరిశీలించిన రామస్వామి.మండలంలోని సనుగుల గ్రామంతో పాటు దేవుని తండా,జలపతి తండా ప్రాంతంలో రాళ్ల వర్షం కురిసి వరి పంట దెబ్బతినడం జరిగిందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగి రైతులు నష్టపోవడం బాధాకరం అన్నారు. ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మండలంలోని అన్ని గ్రామాల లో పంట పొలాలను పరిశీలించి నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. అధికారులతో కలిసి సందర్శించి నష్టాన్ని అంచనా వేయాలని కోరడం జరిగిందనీ అన్నారు.ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు నష్టపరిహారాన్ని అందించడం కోసం కృషి చేస్తామని, రైతులు ఎవరు కూడా అధైర్య పడవద్దు అని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నాగం కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, నాయకులు ముస్కు ముకుంద రెడ్డి,గొట్టే ప్రభాకర్, ఏఎంసీ డైరెక్టర్లు ఇందూరి మధు, ఈసరి శ్రీనివాస్, అమర బండ సాయి, కరీం,లచ్చి రెడ్డి, కృష్ణ, కిసాన్ సెల్ అధ్యక్షులు బాణాల రవీందర్ రెడ్డి, నేతి కుంట జలపతి,ఈగోళం శ్రీనివాస్, సురేందర్ రావు, జవ్వాజి నాగరాజు, బొడిగే అనిల్, పృథ్వి, రాదారపు రాజు, బీరయ్య, అధికారులు,రైతులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News