నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)*.అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించిన సామాజిక విప్లవకారులు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరస్తాలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాల వేసి జయంతి నివాళులర్పించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గము శాసన సభ్యురాలు *సబితా ఇంద్రారెడ్డి* ఈ సందర్భంగా సబితా ఇంద్రా రెడ్డి అమూల్యమైన ఉపన్యాసము,.. అసమానతలు, వివక్ష, కట్టుబాట్లను బద్దలు కొట్టి వెనకబడిన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే విద్యనే ఏకైక మార్గమని తెలియజేస్తూ అనేక అవమానాలను ఈసలింపులను ఎదుర్కొని వెనుకబడిన వర్గాలలో వెలుగులు నింపిన గొప్ప నాయకులు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. పూలే ఆలోచనలను కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లడమే అసలైన జయంతి నివాళులు అని అన్నారు . ఈ కార్యక్రమంలో…మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆర్కల భూపాల్ రెడ్డి మాజీ కార్పొరేటర్లు, ఉద్యమ నాయకులు, మహిళా నాయకురాలు కుల సంఘాల పెద్దలు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





