Thursday, March 12, 2026

అనంతగిరి సొసైటీ వద్ద గందరగోళం

క్యూలైన్ విషయంలో తలెత్తిన వివాదం

  • ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న రైతులు

నేటి సాక్షి కోదాడ (అనంతగిరి)

సూర్యాపేట జిల్లా అనంతగిరి ప్రాథమిక సహకార
సంఘం నందు గందరగోళం నెలకొంది. యురియా బస్తాల కోసం రైతులు తెల్లవారుజామునుండే క్యూ లైన్ లో నిలబడ్డారు. నిలబడే క్రమంలో ఒకరు ముందు ఒకరు వెనుక అనే వివాదంతో రైతులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సొసైటీ వద్దకు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. యురియా కష్టాలు తప్పడం లేదని అధికారులు కూడా ఎవరూ పట్టించుకోవటం లేదంటూ రైతులు ఆరోపిస్తున్నారు. సొసైటీ పరిధిలో చాలా గ్రామాలు రైతులు ఉంటే కేవలం 270 బస్తాలు మాత్రమే ఇవ్వండం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News