Friday, April 3, 2026

*శ్రీ భార్గవి హై స్కూల్ డైరెక్టర్ పీవీ సురేష్ సేవలు అభినందనీయం* * గుంటూరు కృష్ణా జిల్లాల మాజీ ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు* శ్రీ భార్గవి అధినేత సురేష్ లక్ష్మీ దంపతులకు ఘన సన్మానం * సన్మానించిన మాజీ ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గజేషన్ సెక్రెటరీ వహీద్ హుస్సేన్నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం)కర్లపాలెం మండలంలో గత 24 సంవత్సరాలుగా విద్యా, సేవా రంగాలలో శ్రీ భార్గవి హై స్కూల్ డైరెక్టర్ పివి సురేష్ చేస్తున్న సేవలు అభినందనీయమని గుంటూరు కృష్ణా జిల్లాల మాజీఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ఆదివారం గుంటూరు రెవిన్యూ కళ్యాణ మండపంలో నేషనల్ ఏపీజే అబ్దుల్ కలాం 2025 అవార్డు ప్రధాన ఉత్సవ సభలో లక్ష్మణరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అవార్డు ప్రధాన ఉత్సవ సభ లో లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యారంగం తో పాటుగా సుమారు 15 సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసిన సురేష్ సేవలు మరువలేనివి అన్నారు. సభలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ వహీద్ హుస్సేన్ మాట్లాడుతూ రానున్న కాలంలో సురేష్ మరిన్ని సేవా కార్యక్రమాలతో పాటుగా ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని కోరారు. జన విజ్ఞాన వేదిక ప్రెసిడెంట్ వి లక్ష్మణ రెడ్డి ఎస్ పి ఎల్ టి ఓ టీచర్స్ ఆర్గనైజేషన్ నేషనల్ ప్రెసిడెంట్ పి నాగయ్య అప్సమ, వైస్ ప్రెసిడెంట్ మస్తాన్రావు ,రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కాటూరి వెంకటేశ్వరరావు, అప్స స్టేట్ ట్రెజరర్ చెరుకూరి శ్రీహరి, ఏసీ లా కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ రాణి, శ్రీ అమృత వర్షిని పలువురు శ్రీ భార్గవి హై స్కూల్ డైరెక్టర్ పివి సురేష్ లక్ష్మీ దంపతులను దిశాలు వాళ్ళు పూలమాలలు మెమొంటోళ్లు తో ఘనంగా సత్కరించారు .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News