*నేటి సాక్షి* తిరుమలాయపాలెం ఫిబ్రవరి 12(మెట్టు రుద్రరాజు).ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల హక్కులను కాల రాస్తున్న కేంద్ర ప్రభుత్వం విధానాలకు నిరసనగా భారీ రాస్తారోకో జరిగింది ఈ నిరసన ప్రదర్శనలో అసంఘటిత కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అంగన్వాడీలు ఆశ వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు గ్రామపంచాయతీ కార్మికులు స్కీమ్ వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని దేశవ్యాప్త సమ్మెకు సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కొమ్ము శ్రీను సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు వశపంగు వీరన్న మాట్లాడుతూ దశాబ్దాల కాలమును నుండి 29 కార్మిక చట్టాలను సాధించుకొని ఎనిమిది గంటల పని విధానాన్ని అమలుపరచుకొని కార్మిక హక్కులను కాపాడుకుంటున్నారు దీనికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం లో ఉన్న బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుంది కార్మికులను కట్టు బానిసలుగా చేస్తా ఉంది కనీస వేతనం 26 వేల రూపాయలు ప్రభుత్వం సెక్టర్లో పనిచేసే వారికి ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా గాని వాటిని అమలు పరచకుండా కార్మికులు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మికుల నోట్ల మన్నుకొట్టే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయకుంటే భవిష్యత్తులో కార్మికులందరికీ కూడాగట్టి భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు రాస్తారోకోలు జరుపుతామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు జనక శ్వేత, నాగమల్లేశ్వరి, మంజుల, సుహాసిని, బేబీ, నెల్లుట్ల పుష్ప, గాయత్రి ,పద్మ, మోటమర్రి నాగేంద్ర, గురపాటి లత, దోమల సత్యవతి, మమత, జనక పోలమ్మ, తిమ్మిడి సైదమ్మ, లక్ష్మి, జిల్లా ఉప్పలయ్య, శ్రీను, గురవయ్య, రామ్మూర్తి ,సుంచు ఉపేంద్ర పద్మ ఉప్పమ్మ భాగ్యమ్మ కోడి లింగయ్య పట్ల అంజయ్య గట్టిగుండ్ల మల్సూర్ ఎస్కే మల్సూర్ మాణిక్యరావు రాము క్రాంతి కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నిరుసుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

