Tue, Jun 09, 2026
YouTube
Rivx Studios
News Thumb *పరిగిలో బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశం .* నేటి సాక్షి, పరిగి News Thumb *వేంపెంట శ్రీ రామాలయం ప్రతిష్ట మహోత్సవానికి అందరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చిన చైర్మన్- టేకూరి. రామసుబ్బమ్మ* *వేంపెంట శ్రీ రామాలయ 98 సంవత్సరాల చరిత్రకు నూతన అధ్యాయం:-డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు(సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు)* News Thumb *జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.* • కోదాడ మండలం దొరకుంట సమీపంలో ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టిన స్కార్పియో కార్. • ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు. • ప్రమాదంలో రామ్ కోటేశ్వరరావు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం. • ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. • క్షతగాత్రులను 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. • బాధితులంతా ఏపీలోని జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి చెందినవారిగా గుర్తింపు. • కూసుమంచి గ్రామంలో పెళ్లి సంబంధం చూసుకుని తిరుగుప్రయాణంలో ఉండగా జరిగిన విషాదం News Thumb సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే కారణం.. News Thumb ప్రకృతిని రక్షించడం...ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే బిఎల్ఆర్ News Thumb పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం News Thumb హెడ్లైన్ : భూగేని చెరువు అభివృద్ధి పనులకు భూమిపూజ _ రూ.48 లక్షలతో ఆధునిక సౌకర్యాల కల్పన – ఎన్. రాఘవేంద్ర రెడ్డి News Thumb *అధికారుల నిర్లక్ష్యానికి పాడిగేదె మృతి* News Thumb హరీష్ రావ్ ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు News Thumb జూన్ 5న హైదరాబాదులో జరిగే తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయండి* News Thumb *సచివాలయ ఏఎన్ఎం లను పూర్తిగా వైద్య శాఖ పరిధిలోకి చేర్చాలి*..*ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు డిమాండ్*.. News Thumb ఎల్ నీ నో ప్రభావం ఉండడం వల్ల రైతులు పంటలు పండించడంలో జాగ్రత్తలు వహించాలి.. చేవెళ్ల ఆర్డిఓ పా ర్త సింహారెడ్డి.. News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb *పరిగిలో బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశం .* నేటి సాక్షి, పరిగి News Thumb *వేంపెంట శ్రీ రామాలయం ప్రతిష్ట మహోత్సవానికి అందరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చిన చైర్మన్- టేకూరి. రామసుబ్బమ్మ* *వేంపెంట శ్రీ రామాలయ 98 సంవత్సరాల చరిత్రకు నూతన అధ్యాయం:-డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు(సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు)* News Thumb *జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.* • కోదాడ మండలం దొరకుంట సమీపంలో ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టిన స్కార్పియో కార్. • ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు. • ప్రమాదంలో రామ్ కోటేశ్వరరావు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం. • ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. • క్షతగాత్రులను 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. • బాధితులంతా ఏపీలోని జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి చెందినవారిగా గుర్తింపు. • కూసుమంచి గ్రామంలో పెళ్లి సంబంధం చూసుకుని తిరుగుప్రయాణంలో ఉండగా జరిగిన విషాదం News Thumb సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే కారణం.. News Thumb ప్రకృతిని రక్షించడం...ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే బిఎల్ఆర్ News Thumb పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం News Thumb హెడ్లైన్ : భూగేని చెరువు అభివృద్ధి పనులకు భూమిపూజ _ రూ.48 లక్షలతో ఆధునిక సౌకర్యాల కల్పన – ఎన్. రాఘవేంద్ర రెడ్డి News Thumb *అధికారుల నిర్లక్ష్యానికి పాడిగేదె మృతి* News Thumb హరీష్ రావ్ ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు News Thumb జూన్ 5న హైదరాబాదులో జరిగే తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయండి* News Thumb *సచివాలయ ఏఎన్ఎం లను పూర్తిగా వైద్య శాఖ పరిధిలోకి చేర్చాలి*..*ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు డిమాండ్*.. News Thumb ఎల్ నీ నో ప్రభావం ఉండడం వల్ల రైతులు పంటలు పండించడంలో జాగ్రత్తలు వహించాలి.. చేవెళ్ల ఆర్డిఓ పా ర్త సింహారెడ్డి.. News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం
తాజా వార్తలు
*పరిగిలో బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశం .* నేటి సాక్షి, పరిగి *వేంపెంట శ్రీ రామాలయం ప్రతిష్ట మహోత్సవానికి అందరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చిన చైర్మన్- టేకూరి. రామసుబ్బమ్మ* *వేంపెంట శ్రీ రామాలయ 98 సంవత్సరాల చరిత్రకు నూతన అధ్యాయం:-డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు(సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు)* *జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.* • కోదాడ మండలం దొరకుంట సమీపంలో ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టిన స్కార్పియో కార్. • ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు. • ప్రమాదంలో రామ్ కోటేశ్వరరావు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం. • ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. • క్షతగాత్రులను 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. • బాధితులంతా ఏపీలోని జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి చెందినవారిగా గుర్తింపు. • కూసుమంచి గ్రామంలో పెళ్లి సంబంధం చూసుకుని తిరుగుప్రయాణంలో ఉండగా జరిగిన విషాదం సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే కారణం.. ప్రకృతిని రక్షించడం...ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే బిఎల్ఆర్
గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? - Rivx Studios
india

గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు?

Published on May 17, 2026 at 11:21 PM

4,308 Views

Quick Summary:

అయితే విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గడం ఇటీవలి సంక్షోభాలకంటే ముందే జరిగింది.

గోవా దక్షిణ ప్రాంతం అంచున పొడవాటి ఇసుక తీరరేఖలో నెలవంక ఆకృతిలో ఉండే పాలోలెమ్ బీచ్ వద్ద మధ్యాహ్న సమయమైంది. భానుడు భగభగలాడి పోతున్నాడు. అయినా సముద్రంలో పర్యటకుల హుషారును ఆ ఎండ ఏమాత్రం ఆపలేకపోతోంది.భారతదేశపు పార్టీ రాజధానిగా తరచూ పిలిచే గోవాలో బీచ్ వైపుండే గుడిసెల్లాంటి తాత్కాలిక వసతి గృహాలు, తక్కువ ఖర్చుతో దొరికే హోటళ్లు పర్యటకులతో నిండిపోయాయి.

అయితే కొన్నేళ్ల క్రితంతో పోలిస్తే ఇక్కడ వచ్చిన మార్పేంటంటే ఒకప్పుడు పాలోలెమ్‌తో పాటు గోవాలోని ఇతర బీచ్ గ్రామాల్లో యూరోపియన్లు, రష్యన్లు ఎక్కువ కనిపించేవారు. ఇప్పుడు ఆ పర్యటకులు కనిపించడం లేదు.ఇక్కడ ఉన్నవారంతా దాదాపుగా దేశీయ పర్యటకులే. ఇది గమనిస్తే విదేశీ పర్యటకులకు గోవాపై ఆసక్తి తగ్గినట్టు అనిపిస్తుంది.అయితే దేశీయ పర్యటకుల సంఖ్య బాగా పెరిగింది. మారుమూల ప్రాంతాల ప్రజల్లో కూడా గోవాపై ఆకర్షణ పెరిగింది.

మారుమూల ప్రాంతాల నుంచి గోవాకు పర్యటకులు

గోవా పర్యటకశాఖ విడుదల చేసిన గణాంకాలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. 2017లో గోవాను దాదాపు 9 లక్షలమంది విదేశీ పర్యటకులు సందర్శించారు. 2025 నాటికి ఆ సంఖ్య దాదాపు 5 లక్షలకు పడిపోయింది. 2016లో దేశీయ పర్యటకుల సంఖ్య 68 లక్షలుంటే, గత ఏడాది వారి సంఖ్య కోటి దాటింది.

ప్రపంచ భౌగోెళిక రాజకీయ పరిస్థితులు విదేశీ పర్యటకులపై ప్రభావం చూపుతున్నాయని గోవా పర్యటక శాఖ ఇటీవల తెలిపింది.'భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసేటప్పుడు మేం ఒకవైపు నిరాశగానూ, మరోవైపు ఆశావాదంతోనూ ఉండాల్సి వస్తోంది’’ అని గోవా పర్యటక మంత్రి రోహన్ ఖాంటే స్థానిక మీడియాకు చెప్పారు.

అయితే విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గడం ఇటీవలి సంక్షోభాలకంటే ముందే జరిగింది. 1960లు, 1970లో హిప్పీల సంస్కృతి ప్రాచుర్యంలో ఉన్న కాలం నుంచే తక్కువ ఖర్చుతో కూడిన విహార కేంద్రంగా గోవాను ఇష్టపడుతూ వచ్చిన విదేశీ పర్యటకులు ఇప్పుడెందుకు దూరమవుతున్నారు?

ప్రజల పరిస్థితి బాలేదు. ముందు కోవిడ్, తర్వాత యుక్రెయిన్ యుద్ధం, ఇప్పుడు మిడిల్ఈస్ట్ పరిణామాలతో విమాన ప్రయాణం బాగా ఖరీదైన వ్యవహారంగా మారింది. కాబట్టి డబ్బు ప్రభావం చాలా ఉంది'' అని ఐదోసారి గోవా పర్యటనలో ఉన్న రష్యన్ బ్యాలే డ్యాన్సర్ సోఫీ చెప్పారు.

''నా స్నేహితుల్లో కొందరు ఈ ఏడాది గోవా కాకుండా తుర్కియే లేదంటే ఈజిప్టు వెళ్తున్నారు. అవి మాకు దగ్గరగా ఉండడం, తక్కువ ఖర్చులో వెళ్లగలిగే అవకాశం ఉండడం ఇందుకు కారణం'' అని ఆమె అన్నారు.

గత 20 ఏళ్ల నుంచి న్యూకాజిల్ నుంచి గోవా వస్తున్న రికో కూడా యూరప్ పర్యటకుల గురించి ఇలాగే చెప్పారు.''మా దేశంలో ప్రస్తుతం విదేశీ పర్యటనలకు ఖర్చుపెట్టడానికి ఎక్కువ డబ్బు లేదు. గత మూడేళ్లగా పర్యటకులు సొంత దేశంలోనే సెలవులు గడపడానికే మొగ్గు చూపుతున్నారు'' అని ఆయన తెలిపారు.

''వీసా ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టడం, అలాగే ఐదేళ్ల వీసా ఖర్చులు పెరగడం కూడా పర్యటకుల సంఖ్య తగ్గడానికి కారణమని బీబీసీతో మాట్లాడిన వాళ్లలో సగం మందికిపైగా అభిప్రాయపడ్డారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com