*నేటి సాక్షి కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్*• చరవాణి ద్వారా మండల అధికారులకు హెచ్చరికలు జారీ • కార్యదర్శుల పనితీరుపై ఆగ్రహం • విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశాలునేటి సాక్షి కోదాడ (అనంతగిరి)నేటి సాక్షి దినపత్రిక కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించారు.మంగళవారం “అడిగేదేవరు ఆపేదెవరు…సమయపాలన పాటించని కార్యదర్శులు” అనే కథనాన్ని నేటి సాక్షి దినపత్రిక ప్రచురించింది కాగా జిల్లా కలెక్టర్ స్పందించారు.అనంతగిరి ఎంపీడీవోకు చరావణి ద్వారా సంప్రదించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.ప్రజా పాలన 99 రోజులు ప్రగతి ప్రణాళికలో జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల నేపథ్యంలో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మండల కార్యదర్శులు నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.సమయపాలన పాటించని వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలుస్తుంది.కలెక్టర్ ఆదేశాలతో మండల అధికారులు సదురు కార్యదర్శులను జూమ్ మీటింగ్ ద్వారా హెచ్చరించి విదుల పట్ల కార్యదర్శులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉదయం 8 నుండి సాయత్రం 5 గంటల వరకు విధుల్లో ఉండాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.కార్యదర్శులు పనితీరుపై నేటి సాక్షి కథనాన్ని పలువురు అభినందించారు.అదేవిధంగా ఉపాధిహామీ పనుల్లో జ్యాప్యం జరుగుతుందని దానిపై వివరణ ఇవ్వాలని అడిగినట్లు సమాచారం





