నేటి సాక్షి చెన్నూరు మండలం సుబ్బారాంపల్లి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను చెన్నూర్ టౌన్ సీఐ బన్సీలాల్ తమ సిబ్బంది తో కలిసి దాడులు నిర్వహించి ఇసుక ట్రాక్టర్ లను పట్టుకున్నారు. మండలంలోని సుబ్బరాంపల్లి వాగు సమీపంలోని అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకని రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లు ఒక జేసీబీ ని పోలీసులు పట్టుకొని పోలీసు స్టేషన్ కు తరలించారు.అదే క్రమంలో పొక్కూర్ సమీపంలో గోదావరి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేయగా మరో రెండు ట్రాక్టర్లు పరారీలో ఉన్నాయి.పట్టుబడ్డ మూడు ట్రాక్టర్లు ఒక జేసీబీ ని తదుపరి విచారణ నిమిత్తం మైనింగ్ అధికారులకు అప్పగిస్తామని సిఐ బన్సీలాల్ అన్నారు,మరియు చెన్నూరు గోదావరి తీరా ప్రాంతాల నుంచి ఎలాంటి అక్రమ రవాణా జరుగుతలేదని జిల్లా మైనింగ్ అధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చెప్పిన నాల్గురోజులు కాకముందే పోలీసులు అక్రమ ఇసుక రవాణా పై పోలీసులు ఏకకాలంగా దాడులు చేసి ట్రాక్టర్లు పట్టుకోవడం చర్చనీయంగ్గా మారింది ఇందులో ఎవరెవరు ఉన్నారో వేచి చూడాలి మరి…





